Friday, 18 October 2024

#KaalBhairavaTempleDarshanDatesInNovember2024 #నవంబర్2024కాలభైరవటెంపుల్_దర్శనంతేదీలు #KalabhairavaGuru 2024నవంబర్01 శుక్రవారం దీపావళి అమావాస్య, స్వాతి నక్షత్ర యుక్త అభ్యంగన స్నాన మహోత్సవం, పితృ కార్య మహోత్సవం, ప్రదోషకాల దీప పూజ దీప దాన మహోత్సవం, దివిటీ ప్రజ్వలన మహోత్సవం, కేదారవత మహోత్సవం, మహాలక్ష్మి పూజ మహోత్సవం.2024నవంబర్03 ఆదివారం, 2024నవంబర్09 అష్టమి, 2024నవంబర్10 ఆదివారం41 రో.కాలభైరవ దీక్షలు ప్రారంభం, 2024నవంబర్15 కార్తీకపూర్ణిమ శుక్రవారం, జ్వాలాతోరణం,2024నవంబర్17 ఆదివారం, 2024నవంబర్23 కాలాష్టమి, 2024నవంబర్24 ఆదివారం#కాలభైరవస్వామీజీ #kalabhiravaswamy

Sunday, 29 September 2024

#పితృఅమావాస్య #మహాలయఅమావాస్య #లక్షరుద్రాక్షలపంపిణీసేవ పితృదేవతల అనుగ్రహం కోసం లక్ష రుద్రాక్షలతో కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక పూజ అభిషేక సేవ. 2024అక్టోబర్ 02 సూర్యగ్రహణం మహాలయ అమావాస్య కాలభైరవునికి వార్షిక లక్షరుద్రాక్షల పూజరాజమండ్రి ఆర్యాపురం, గోదావరి తీరాన కొలువు తీరిన కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో ది.02అక్టోబర్ 2024 బుధవారం మహాలయ అమావాస్య , సర్వ ప్రీతి అమావాస్య సందర్భంగా కాలభైరవగురు సంస్థాన్ మఠం వ్యవస్థాపకులు, శ్రీ కాలభైరవ గురు స్వామిజీ ఆధ్వర్యంలో సర్వజనులకు, ఆయురారోగ్య, అష్టైశ్వర్యములు కలగాలనే శుభ సంకల్పంతో స్వర్ణాకర్షణ కాలభైరవస్వామి వారికి ఉదయం 4.30 ని.లకు లక్ష రుద్రాక్షలతో ప్రత్యేక పూజ, సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకం, 5:30 నిమి లకు కాలభైరవ మహాచండీ హోమం జరుగును. పూజ, అభిషేకం, హోమం అనంతరం పూజించిన శక్తివంతమైన రుద్రాక్షలను సంవత్సరం అంతా ధనప్రసాదముతో పాటు భక్తులకు వితరణ జరుగును. ఉదయం.10.30 ని.లకు భక్తులకు అన్నప్రసాద సేవ ప్రారంభమగును. సూర్యగ్రహణం2వఅక్టోబర్ 2024బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం అని కొన్ని మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి 2024 2025 క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణములు లేవని మన పంచాంగ కర్తలు, పండితులు తెలియజేస్తున్నారు. భారతదేశంలో గ్రహణం ఏదీ కనిపించదు. భారతదేశంలో నివసించే ప్రజలు ఏ విధమైనటువంటి గ్రహ నియమాలు, శాంతి ప్రక్రియలు పాటించవలసిన అవసరం లేదు. పిల్లలకు,వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు కూడా ఏ విధమైన సూతకం ఉండదు.. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ మరియు అర్జెంటీనాలోని చాలా ప్రాంతాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది . పాక్షిక సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కొన్ని దక్షిణ ప్రాంతాల నుండి , దక్షిణ అమెరికాలోని చాలా భాగం , పసిఫిక్ మహాసముద్రం , దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటికా నుండి కనిపిస్తుందని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కాలభైరవ గురుస్వామి తెలియజేశారు.

#KalabhairavaDeeksha2024 #కాలభైరవదీక్ష కాలభైరవటెంపుల్ ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ కాలభైరవాయనమః భక్తులందరికి 2024కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు..23డిసెంబర్2024 మార్గశిర బహుళఅష్టమి, హస్త నక్షత్రము, సోమవారం కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి పర్వదినం. జీవితంలో ఎదురవుతున్న వివిధ రకాల కష్టాలను, నష్టాలను, దుఃఖాలను, దారిద్రాలను, సమస్యలను పోగొట్టే మహోన్నతమైన శక్తివంతమైన దీక్షగా కొనియాడబడుతుంది కాలభైరవ దీక్ష.. కాలభైరవ దీక్ష..ఈ కలియుగంలో అతి శీఘ్రముగా భక్తితో విశ్వాసంతో ప్రార్థించిన వెంటనే ధనవృద్దిని, ధాన్యవృద్దిని , స్వర్ణ వృద్ధిని, ఆరోగ్యవృద్దిని, అఖండ వ్యాపార వృద్ధిని, రాజయోగ సిద్ధిని, అధికారపదవీ యోగ సిద్ధిని, మంత్రసిద్ధిని, జ్ఞాన సిద్ధిని, వాక్చాతుర్య సిద్ధిని, వివాహ సిద్ధిని, సంతాన సిద్ధిని, విజయసిద్ధిని, ఉన్నత ఉద్యోగ సిద్ధిని, విద్యా సిద్ధిని, అఖండ సామ్రాజ్య సిద్ధిని అందించే భారతీయ ప్రాచీన దీక్షయే కాలభైరవ దీక్ష. కాలభైరవ దీక్షను స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు భక్తులు. కారణం కాలభైరవుడే ప్రదితుడు కాబట్టి... కాలభైరవ దీక్షతో కాలభైరవ మంత్రం జపంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు అంటారు జ్ఞానమూర్తులు, గురువులు..*ఈ సంవత్సరంలో కాలభైరవ దీక్ష స్వీకరించుటకు తేదీలు**41రోజులు అనగా ఒకమండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.10.11.2024 ఆదివారం నాడు స్వీకరించాలి..*21రోజులు అనగా అర్ధమండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.1.12.2024 ఆదివారం నాడు స్వీకరించాలి.*9రోజులు కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.15.12.2024 ఆదివారం నాడు స్వీకరించాలి.... 41 రోజులు,21 రోజులు, 9రోజులు దీక్ష చేసిన స్వాములు కాలభైరవ ఇరుముడిని రాజమండ్రి శ్రీకాలభైరవ స్వామి సన్నిధిలో 23.12.2024 సోమవారం కాలభైరవ జయంతి పర్వదినాన సమర్పించాలి. దీక్షావిరమణ అనగా మాలా విరమణ, మహా పూర్ణాహుతి మహోత్సవం 23 డిసెంబర్ 2024 కాలభైరవ జయంతి రోజున సాయంత్రం 4గంటలకు *రాజమండ్రి కాలభైరవ స్వామి సన్నిధిలో పరమ పూజ్యశ్రీ కాలభైరవ స్వామీజీ మన గురువు గారి ఆధ్వర్యంలో* జరుగును.*కాలభైరవ దీక్ష గురించి వివరణ*1.మండల దీక్ష 41రోజుల దీక్ష చేయడం అత్యంత శుభదాయకం.2. స్త్రీలు పిల్లలు అయితే 21 రోజులు లేదా 9 రోజులు స్వీకరించడం మంచిది.2.ప్రాణ ప్రతిష్ట చేసిన 108 సంఖ్య గల రుద్రాక్షమాల, స్వామి పెండెంట్ ధరించాలి. 3.నీలం రంగు వస్త్రాలు ధరించాలి. 4.ఉదయం, సాయంత్రం పంచోపచార పూజ (గంధం, పువ్వులు, అగరుబత్తి, దీపం, నైవేద్యం సమర్పణ) చేయాలి.5. ఖచ్చితంగా కాలభైరవ స్వామి మంత్రం రోజూ 10మాలలు జపం చేయాలి. ఉదయం లేదా సాయంత్రం జపం చేయవచ్చు. రోజూ కాలభైరవ స్వామి వారి మంత్రం జపం చేయకపోతే ఫలితం ఉండదు. రోజూ భక్తితో జపం చేస్తేనే దీక్ష వల్ల మన అభీష్టం నెరవేరుతుంది. 6.అందరినీ స్వామీ అని మాత్రమే పిలవాలి.7.బ్రహ్మ చర్యం పాటించాలి. 8.కుటుంబం పోషణ కోసం చేస్తున్న అన్ని పనులు అనగా ఉద్యోగం, వ్యాపారం అన్నీ యధావిధిగా నిర్వహిస్తూ ఉండాలి. 9.దీక్షాకాలం అంతా కాలభైరవ స్వామి వారి నామస్మరణ చేస్తూనే ఉండాలి. 10.అనవసరమైనవి మాట్లాడకూడదు, వినకూడదు, చూడకూడదు. ఇతరులపైన పుకార్లను అసత్యాలను, నిందలను ఆరోపించరాదు. 11.ఇంట్లోనే దీక్షా కాలం అంతా ప్రతీ రోజు పంచోపచార పూజ చేయాలి.12. ఎవరినీ దూషించరాదు. ఎవరిపైనా నిందలు వేయరాదు, ఎవరి పైనా అసత్య ప్రచారం చేయరాదు. భార్యను అదృష్ట దేవతలా ఆరాధించాలి. లోకంలో ఉండే స్త్రీలందరినీ మన అమ్మ మన తల్లి సమానురాలుగా భావించాలి. ఇంకా కాలభైరవ స్వామి దీక్ష కోసం మరిన్ని వివరాల కోసం 9000 200 117 కు వాట్సాప్ చేయండి. గురువు గారే స్వయంగా మీకు సలహా మరియు సూచన చేస్తారు. ఇంకా మరిన్ని వివరాల కోసం కాలభైరవ మంత్ర పరిహారాల కోసం, కాలభైరవటీవీ, కాలభైరవగురు యూట్యూబ్ ఛానెల్ చూడగలరు.

Friday, 9 August 2024

#కాలసర్పశాంతిపూజ #నాగదోషబలిపూజ కాలభైరవ క్షేత్రంలో నాగపంచమి రోజున కాలసర్ప శాంతి పూజలో నాగదోషబలి ప్రక్రియలో భాగంగా నాగసూత్రం కడుతున్న భక్తలు#KalabhairavaTV #నాగపంచమిపూజ #NagaDoshaBali #రాజమండ్రి #నాగాఅభిషేకం #KalasarpaShanti

కాలభైరవక్షేత్రంలో నాగపంచమిరోజున నాగాభిషేకం చేస్తున్న, ఆరతి ఇస్తున్న భక్తులు #KalabhairavaTV #నాగపంచమిపూజ #రాజమండ్రి #నాగాఅభిషేకం

కాలభైరవక్షేత్రంలో నాగపంచమిరోజున నాగాభిషేకం చేస్తున్న, ఆరతి ఇస్తున్న భక్తులు #KalabhairavaTV #నాగపంచమిపూజ #రాజమండ్రి #నాగాఅభిషేకం

Monday, 3 June 2024

#SyamalaHomam #RajaSyamalaHomam #రాజశ్యామలాహోమం #ధూమావతిమాతజయంతిజూన్142024 శుక్రవారంజ్యేష్ఠ శుద్ధఅష్టమి సందర్భంగా రాజమండ్రి అఖండ గోదావరి తీరాన శ్రీకాలభైరవ క్షేత్రంలో శ్రీరాజశ్యామలా శ్రీరాజమాతంగీ హోమం ఉదయం 6గం.లకు ప్రారంభమగును. ప్రత్యేకంగా లేదా పరోక్షంగా పాల్గొనదలచినవారు 9985551028 నెంబర్ కు WhatsApp ద్వారా సంప్రదించగలరు.1.హోమం ఉదయం 6 గం.ల నుండి 9 గం.ల వరకు ఉంటుంది.2.ఆహుతిద్రవ్యాలు, పూర్ణాహుతి, పంచలోహాలు, నవరత్నాలు, పూజ, హోమసామాగ్రి మొత్తం క్షేత్రంలోనే ఇస్తారు.3.సాంప్రదాయ వస్త్రాల్లో హోమంలో పాల్గొనాలి. స్త్రీలు చీర, పురుషులు పంచే, కండువా ధరించాలి. 4.హోమం అనంతరం శ్రీరాజశ్యామల మాత హోమ ప్రసాదంగా మనికట్టు రక్షాకంకణం, గాజులు, భైరవి కుంకుమ, ప్రసాదంగా పొందగలరు. ప్రత్యక్షంగా పాల్గొనేవారు వెంటనే పొందగలరు , పరోక్షంగా పాల్గొనే వారు 3రోజుల్లో పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ప్రసాదాన్ని పొందగలరు.5.హోమనిర్వాహణకు రూ.2130/-6. GooglePay. 9985551028మీ గోత్రనామాలు, మీ చిరునామా వివరాలు 9985551028 కు వాట్సాప్ ద్వారా పంపించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనగలరు.

Tuesday, 30 January 2024

#రాజశ్యామలాపూజఫలితాలుBenefits Of RajaShyamala mantram Puja.#రాజశ్యామలహోమంకాలభైరవ క్షేత్రంలో కొలువుతీరిన రాజశ్యామలా మాతకు ఈ గుప్త నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు, విశేష హోమాలు జరుగును. రాజశ్యామలా దేవీ సోభాగ్య, శక్తి, మహా ప్రసాదములుగా అనుక్షణం రక్షించే రాజశ్యామలా రక్షా చేతి మణికట్టు శక్తి కంకణం, రవిక (జాకెట్టు వస్త్రం), పసుపు, కుంకుమ, గాజులు, మరియు అమ్మ ప్రసాదం పొందగలరు.10 ఫిబ్రవరి 2024 శనివారం నుండి మాఘమాసం శ్రీరాజశ్యామలా గుప్త నవరాత్రులు సందర్భంగా *రాజమండ్రి శ్రీ కాలభైరవ స్వామి క్షేత్రంలో శ్రీరాజశ్యామలా హోమమ్* 9రోజుల పాటు రోజుకి 3జన్మనక్షత్రముల వారికి 10.02.2024 మాఘశుద్ధ పాడ్యమి శనివారం నుండి నుండి18.02.2024 మాఘశుద్ధ నవమి ఆదివారం వరకు జరుగును.10.02.2024 శనివారం. కుజగ్రహ నక్షత్రములైన మృగశిర, చిత్త, ధనిష్ఠ జన్మ నక్షత్రము వారికి....11.02.2024 ఆదివారం.రాహుగ్రహ నక్షత్రములైన ఆరుద్ర, స్వాతి, శతభిష జన్మ నక్షత్రముల వారికి...12.02.2024 సోమవారం.గురుగ్రహ నక్షత్రములైనపునర్వసు, విశాఖ పూర్వాభాద్ర జన్మ నక్షత్రముల వారికి...13.02.2024మంగళవారం.శనిగ్రహ నక్షత్రములైనపుష్యమి, అనురాధ ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారికి....14.02.2024 బుధవారం.బుధగ్రహ నక్షత్రములైన ఆశ్లేష, జ్యేష్ట, రేవతి జన్మ నక్షత్రముల వారికి...15.02.2024 గురువారం.కేతుగ్రహ నక్షత్రములైన అశ్విని, మఖ, మూల జన్మ నక్షత్రముల వారికి..16.02.3024 శుక్రవారం.శుక్రగ్రహ నక్షత్రములైన భరణి, పుబ్బ, పూర్వాషాఢ జన్మ నక్షత్రముల వారికి...17.02.2024 శనివారం.సూర్య గ్రహ నక్షత్రములైన కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ జన్మ నక్షత్రముల వారికి..18.02.2024 ఆదివారం.చంద్ర గ్రహ నక్షత్రములైన రోహిణి, హస్త, శ్రవణ జన్మ నక్షత్రముల వారికి నవగ్రహ, జన్మనక్షత్రముల ప్రకారం జరుగును.శ్రీరాజశ్యామలా కాలభైరవ హోమం ప్రతీ రోజు ఉదయం 6గం.లకు ప్రారంభమగును. ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొని హోమకుండంలో శ్రీరాజశ్యామల దేవీ, శ్రీకాలభైరవ స్వామి ప్రీతి ద్రవ్యాలను, అహుతులను, మరియు ప్రత్యేక పూర్ణాహుతి మూటను స్వయంగా సమర్పించే అవకాశం కల్పించబడింది. స్వయంగా పాల్గొనే అవకాశము లేనివారు వారి గోత్ర నామాలు తెలియజేసి పరోక్షంగా పాల్గొని అనుక్షణం రక్షించే రాజశ్యామలా రక్షా చేతి మణికట్టు శక్తి కంకణం, రాజశ్యామలా దేవీ సోభాగ్య వస్తువులు రవిక (జాకెట్టు వస్త్రం), పసుపు, కుంకుమ, గాజులు, మరియు ప్రసాదం పొందగలరు. హోమంలో పాల్గొన్నవారు. హోమానికి కావాలసిన సామాగ్రి మొత్తం అన్ని ఇక్కడే ఇస్తారు. అనుకున్న సమయానికి సంప్రదాయ వస్తారు అనగా మగవారు పంచే - కండువా , ఆడవారు చీర, మెడలో కండువా లేదా తుమాలు ధరించిరావాలి.. హోమ కుండంలో ద్రవ్యాలు, ఆహుతులు వేసేటప్పుడు గురువు గారు చెప్పే విధంగా శ్రీ రాజశ్యామలా కాలభైరవ మంత్రము ఖచ్చితంగా స్మరిస్తూ వేస్తూ ఉండాలి. మరిన్ని వివరాలకోసం 9000200717 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సంప్రదించగలరు. (గమనిక: ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5గం. వరకు మాత్రమే ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది.) లేదా కాలభైరవ టీవి, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ చూడగలరు. శ్రీరాజశ్యామలా మాత, శ్రీవారాహి మాత, దృష్టిదోషాలను పోగొట్టే కాలచక్ర ఫోటోతో కూడిన 2024 *కాలభైరవగురు క్యాలండర్* కూడా అందుబాటులో ఉన్నది.*భక్తులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు*

Thursday, 18 January 2024

వివరణ కోసం క్లిక్ చేయండి👇https://youtu.be/EjbKnvB366g?si=zeQ2GIpTfKq08ktM ఎంత పెద్ద కోరినైనా 9 రోజుల్లో తీర్చగల #శ్యామలమంత్రం | #ShyamalaNavaratri Simple Puja Method Mantram#రాజశ్యామలాహోమమ్ #RajasyamalaHomam #Rajahmundry రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో మాఘశుద్ధ పాడ్యమి10.02.2024 నుండి మాఘ శుద్ధ 18.02.2024 నవమి వరకు 9 రోజులపాటు రోజుకి 3 జన్మనక్షత్రాల చొప్పున 27 జన్మ నక్షత్రాలకు శ్రీ రాజశ్యామల మూలమంత్ర హోమం జరుగును. ఒకరోజు ఒక గ్రహానికి అనగా 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆహుతి, పూర్ణాహుతి, దేవతా ప్రీతి ద్రవ్యాల సమర్పణ స్వయంగా శ్రీ రాజశ్యామల హోమకుండంలో సమర్పించే అవకాశం అందరికీ కల్పించబడింది.

Friday, 12 January 2024

#2024రాజశ్యామలాహోమాలు #2024శ్రీరాజశ్యామలాగుప్తనవరాత్రులు #RajaShyamalaHomam #RajasyamalaNavaraatrulu #Rajahmundry రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో మాఘశుద్ధ పాడ్యమి10.02.2024 నుండి మాఘ శుద్ధ 18.02.2024 నవమి వరకు 9 రోజులపాటు రోజుకి 3 జన్మనక్షత్రాల చొప్పున 27 జన్మ నక్షత్రాలకు శ్రీ రాజశ్యామల మూలమంత్ర హోమం జరుగును. ఒకరోజు ఒక గ్రహానికి అనగా 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆహుతి, పూర్ణాహుతి, దేవతా ప్రీతి ద్రవ్యాల సమర్పణ స్వయంగా శ్రీ రాజేష్ శ్యామల హోమకుండంలో సమర్పించే అవకాశం అందరికీ కల్పించబడింది.nమరిన్ని పూర్తి వివరాలకు 9000200717 కు సంప్రదించగలరు.