Sunday, 29 September 2024

#KalabhairavaDeeksha2024 #కాలభైరవదీక్ష కాలభైరవటెంపుల్ ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ కాలభైరవాయనమః భక్తులందరికి 2024కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు..23డిసెంబర్2024 మార్గశిర బహుళఅష్టమి, హస్త నక్షత్రము, సోమవారం కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి పర్వదినం. జీవితంలో ఎదురవుతున్న వివిధ రకాల కష్టాలను, నష్టాలను, దుఃఖాలను, దారిద్రాలను, సమస్యలను పోగొట్టే మహోన్నతమైన శక్తివంతమైన దీక్షగా కొనియాడబడుతుంది కాలభైరవ దీక్ష.. కాలభైరవ దీక్ష..ఈ కలియుగంలో అతి శీఘ్రముగా భక్తితో విశ్వాసంతో ప్రార్థించిన వెంటనే ధనవృద్దిని, ధాన్యవృద్దిని , స్వర్ణ వృద్ధిని, ఆరోగ్యవృద్దిని, అఖండ వ్యాపార వృద్ధిని, రాజయోగ సిద్ధిని, అధికారపదవీ యోగ సిద్ధిని, మంత్రసిద్ధిని, జ్ఞాన సిద్ధిని, వాక్చాతుర్య సిద్ధిని, వివాహ సిద్ధిని, సంతాన సిద్ధిని, విజయసిద్ధిని, ఉన్నత ఉద్యోగ సిద్ధిని, విద్యా సిద్ధిని, అఖండ సామ్రాజ్య సిద్ధిని అందించే భారతీయ ప్రాచీన దీక్షయే కాలభైరవ దీక్ష. కాలభైరవ దీక్షను స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు భక్తులు. కారణం కాలభైరవుడే ప్రదితుడు కాబట్టి... కాలభైరవ దీక్షతో కాలభైరవ మంత్రం జపంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు అంటారు జ్ఞానమూర్తులు, గురువులు..*ఈ సంవత్సరంలో కాలభైరవ దీక్ష స్వీకరించుటకు తేదీలు**41రోజులు అనగా ఒకమండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.10.11.2024 ఆదివారం నాడు స్వీకరించాలి..*21రోజులు అనగా అర్ధమండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.1.12.2024 ఆదివారం నాడు స్వీకరించాలి.*9రోజులు కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.15.12.2024 ఆదివారం నాడు స్వీకరించాలి.... 41 రోజులు,21 రోజులు, 9రోజులు దీక్ష చేసిన స్వాములు కాలభైరవ ఇరుముడిని రాజమండ్రి శ్రీకాలభైరవ స్వామి సన్నిధిలో 23.12.2024 సోమవారం కాలభైరవ జయంతి పర్వదినాన సమర్పించాలి. దీక్షావిరమణ అనగా మాలా విరమణ, మహా పూర్ణాహుతి మహోత్సవం 23 డిసెంబర్ 2024 కాలభైరవ జయంతి రోజున సాయంత్రం 4గంటలకు *రాజమండ్రి కాలభైరవ స్వామి సన్నిధిలో పరమ పూజ్యశ్రీ కాలభైరవ స్వామీజీ మన గురువు గారి ఆధ్వర్యంలో* జరుగును.*కాలభైరవ దీక్ష గురించి వివరణ*1.మండల దీక్ష 41రోజుల దీక్ష చేయడం అత్యంత శుభదాయకం.2. స్త్రీలు పిల్లలు అయితే 21 రోజులు లేదా 9 రోజులు స్వీకరించడం మంచిది.2.ప్రాణ ప్రతిష్ట చేసిన 108 సంఖ్య గల రుద్రాక్షమాల, స్వామి పెండెంట్ ధరించాలి. 3.నీలం రంగు వస్త్రాలు ధరించాలి. 4.ఉదయం, సాయంత్రం పంచోపచార పూజ (గంధం, పువ్వులు, అగరుబత్తి, దీపం, నైవేద్యం సమర్పణ) చేయాలి.5. ఖచ్చితంగా కాలభైరవ స్వామి మంత్రం రోజూ 10మాలలు జపం చేయాలి. ఉదయం లేదా సాయంత్రం జపం చేయవచ్చు. రోజూ కాలభైరవ స్వామి వారి మంత్రం జపం చేయకపోతే ఫలితం ఉండదు. రోజూ భక్తితో జపం చేస్తేనే దీక్ష వల్ల మన అభీష్టం నెరవేరుతుంది. 6.అందరినీ స్వామీ అని మాత్రమే పిలవాలి.7.బ్రహ్మ చర్యం పాటించాలి. 8.కుటుంబం పోషణ కోసం చేస్తున్న అన్ని పనులు అనగా ఉద్యోగం, వ్యాపారం అన్నీ యధావిధిగా నిర్వహిస్తూ ఉండాలి. 9.దీక్షాకాలం అంతా కాలభైరవ స్వామి వారి నామస్మరణ చేస్తూనే ఉండాలి. 10.అనవసరమైనవి మాట్లాడకూడదు, వినకూడదు, చూడకూడదు. ఇతరులపైన పుకార్లను అసత్యాలను, నిందలను ఆరోపించరాదు. 11.ఇంట్లోనే దీక్షా కాలం అంతా ప్రతీ రోజు పంచోపచార పూజ చేయాలి.12. ఎవరినీ దూషించరాదు. ఎవరిపైనా నిందలు వేయరాదు, ఎవరి పైనా అసత్య ప్రచారం చేయరాదు. భార్యను అదృష్ట దేవతలా ఆరాధించాలి. లోకంలో ఉండే స్త్రీలందరినీ మన అమ్మ మన తల్లి సమానురాలుగా భావించాలి. ఇంకా కాలభైరవ స్వామి దీక్ష కోసం మరిన్ని వివరాల కోసం 9000 200 117 కు వాట్సాప్ చేయండి. గురువు గారే స్వయంగా మీకు సలహా మరియు సూచన చేస్తారు. ఇంకా మరిన్ని వివరాల కోసం కాలభైరవ మంత్ర పరిహారాల కోసం, కాలభైరవటీవీ, కాలభైరవగురు యూట్యూబ్ ఛానెల్ చూడగలరు.

No comments:

Post a Comment