Sunday, 29 September 2024

#పితృఅమావాస్య #మహాలయఅమావాస్య #లక్షరుద్రాక్షలపంపిణీసేవ పితృదేవతల అనుగ్రహం కోసం లక్ష రుద్రాక్షలతో కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక పూజ అభిషేక సేవ. 2024అక్టోబర్ 02 సూర్యగ్రహణం మహాలయ అమావాస్య కాలభైరవునికి వార్షిక లక్షరుద్రాక్షల పూజరాజమండ్రి ఆర్యాపురం, గోదావరి తీరాన కొలువు తీరిన కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో ది.02అక్టోబర్ 2024 బుధవారం మహాలయ అమావాస్య , సర్వ ప్రీతి అమావాస్య సందర్భంగా కాలభైరవగురు సంస్థాన్ మఠం వ్యవస్థాపకులు, శ్రీ కాలభైరవ గురు స్వామిజీ ఆధ్వర్యంలో సర్వజనులకు, ఆయురారోగ్య, అష్టైశ్వర్యములు కలగాలనే శుభ సంకల్పంతో స్వర్ణాకర్షణ కాలభైరవస్వామి వారికి ఉదయం 4.30 ని.లకు లక్ష రుద్రాక్షలతో ప్రత్యేక పూజ, సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకం, 5:30 నిమి లకు కాలభైరవ మహాచండీ హోమం జరుగును. పూజ, అభిషేకం, హోమం అనంతరం పూజించిన శక్తివంతమైన రుద్రాక్షలను సంవత్సరం అంతా ధనప్రసాదముతో పాటు భక్తులకు వితరణ జరుగును. ఉదయం.10.30 ని.లకు భక్తులకు అన్నప్రసాద సేవ ప్రారంభమగును. సూర్యగ్రహణం2వఅక్టోబర్ 2024బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం అని కొన్ని మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి 2024 2025 క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణములు లేవని మన పంచాంగ కర్తలు, పండితులు తెలియజేస్తున్నారు. భారతదేశంలో గ్రహణం ఏదీ కనిపించదు. భారతదేశంలో నివసించే ప్రజలు ఏ విధమైనటువంటి గ్రహ నియమాలు, శాంతి ప్రక్రియలు పాటించవలసిన అవసరం లేదు. పిల్లలకు,వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు కూడా ఏ విధమైన సూతకం ఉండదు.. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ మరియు అర్జెంటీనాలోని చాలా ప్రాంతాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది . పాక్షిక సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కొన్ని దక్షిణ ప్రాంతాల నుండి , దక్షిణ అమెరికాలోని చాలా భాగం , పసిఫిక్ మహాసముద్రం , దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటికా నుండి కనిపిస్తుందని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కాలభైరవ గురుస్వామి తెలియజేశారు.

No comments:

Post a Comment