Friday, 25 December 2020

#కాలభైరవస్వామినిఆరాధించడంవల్ల కలిగే ప్రయోజనాలు. #Share కాలభైరవ అంటే ఖచ్చితత్వం, కాలం పై విజయం, పచ్చి నిజం, యదార్ధం, లేదా కల్తీ లేని ఆత్మ తత్వం. “నేను పరమాత్మ స్వరూపము" అనే జ్ఞానం సంపత్తి. అతను నీలిమేఘ స్వరూపాన్ని, దిగంబర మరియు తీక్షణ నేత్ర వీక్షణము కలిగి తలపై చంద్రుని ధరించి, నాలుగు హస్తములతో ఒక చేతిలో స్వర్ణ అక్షయపాత్రతో మనల్ని ధన,ధాన్య, స్వర్ణ, ఐశ్వర్య, ఆరోగ్య వంతుల్ని చేయడానికి, రెండవ హస్తంలో త్రిశూలం ప్రియ భక్తులను రక్షించడానికి శత్రు సంహారం కోసం, పాపభక్షణ చేయడానికీ, మూడవ హస్తంలో డమరుకం మేధా శక్తి, జ్ఞానసంపత్తి ఒసగుటకు నాల్గవహస్తంలో పాశం నిత్యానందము ప్రసాదిస్తూ మరియు అకాల మృత్యువుల నుండి రక్షుస్తూ ఆయుష్షు కారకత్వం వహిస్తాడు. నిత్యంరక్షిస్తూ ఉంటాడు.#ఎవరోమీకుదోషాలుఉన్నాయిఅని శాంతులు చేయాలని దానికి ఇంత సొమ్ము అవుతుందని చెపితే అవి నమ్మిమోసపోవద్దు.డబ్బులువృదా చేసుకోవద్దు. మన ధర్మంపై నమ్మకాన్ని కోల్పోవద్దు. అన్ని సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు. సంకల్పబలంతో, భగవత్ నామస్మరణతోపెళ్లి.ఉద్యోగం.వ్యాపారం. సంతానం.ధనం నిలకడ లేకపోవడం. నరదృష్టి.నాగదోషం. కాలసర్ప దోషం, శని,కుజ దోషం, నవగ్రహదోషాలు, వంటి సమస్యలు,చదువులో ముందుకు రాలేక పోవడం,ఉద్యోగంనిలకడ లేక పోవడం, పరస్త్రీ, పరపురుషుల వ్యామోహాలు. పెళ్లి ఆలస్యంకావటం, భార్యాభర్తలమధ్య తగాదాలు రావడం, సంతానప్రాప్తి సమయానికి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కోర్టుసమస్యలు అధికం కావడం, సినిమా ప్రయత్నాలు విఫలంకావడం , రాజకీయాలలోఎదుగుదల లేకపోవడం , గొప్ప క్రీడాకారుడు కావాలని విఫలమవటం ఇంకా ఏ సమస్యకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం.1రోజూ లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి. మీకు ఏమి అభీష్టామో సంకల్పించి కొని కాలభైరవదశనామరక్షా స్తోత్రము11మార్లు పఠించండి.2. మీపని అంటే మీ ప్రయత్నం,ఉద్యోగ వ్యాపార కుటుంబపోషణ కోసం మీరు చేసే పనిపై మరింతశ్రద్ధను పెట్టండి. 3. పాజిటివ్ గా ఉండండి. 4. మిమ్మల్ని మీరు గౌరవించుకొండి. 5. మీ అమ్మనాన్న భార్యభర్త పిల్లలను మీపొరుగు వారిని అందరినీ ప్రేమించండి.వారిలో మంచిని చూడండి.6. అనుక్షణం దేవుణ్ణి స్మరించండి.7రోజూ కనీసం ఒకరూపాయి అయినా దానం చేయండి. ఆహార రూపంగా ఏజీవికైనా సరే.8.కాలభైరవసహస్ర నామస్తోత్రం రోజు 1సారి పారాయణచేయండి మీ ఇంటి వద్దరోజు ఒకగుప్పెడు బియ్యంతీసి పక్కన వేయండి.నెలకు1సారి వాటిని చిత్రాన్నముచేసి అందరికి పంచండి.

No comments:

Post a Comment